రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలో దారుణం జరిగింది. తాగిన మైకంలో తండ్రినే హత్య చేశాడు ఓ వ్యక్తి. కాలనీకి చెందిన రాంనర్సయ్య, విష్ణు తండ్రీకొడుకులు. నిన్న రాత్రి ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఇద్దరూ గొడవ పడ్డారు. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన విష్ణు రోకలి బండతో తండ్రితలపై కొట్టాడు. నర్సయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
తండ్రిని రోకలి బండతో కొట్టి చంపిన కొడుకు
మద్యం మత్తులో కన్న తండ్రిని రోకలి బండతో మోది కొడుకు హత్య చేసిన ఘటన హయత్నగర్లో జరిగింది.
తండ్రిని రోకలి బండతో కొట్టి చంపిన కొడుకు
మద్యం మత్తులో ఉన్న విష్ణు కూడా మత్తులోకి జారుకున్నాడు. తెల్లవారుజామున లేచి చూసేసరికి రక్తపుమడుగులో ఉన్న తండ్రిని చూసి 108కి సమాచారం అందించాడు. వారు వచ్చి చూడగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించినట్లు వనస్థలీపురం ఏసీపీ జయరాం తెలిపారు.
ఇదీ చూడండి: పోలీస్ ఉద్యోగం వచ్చింది..మృత్యువు వెంటాడింది..