మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ పోలింగ్ కేంద్రంలో వాగ్వాదం చెలరేగింది. కాంగ్రెస్, తెరాస పార్టీలకు చెందిన జడ్పీటీసీ అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద నువ్వు ప్రచారం చేస్తున్నావంటే, నువ్వు చేస్తున్నావంటూ గొడవ పడ్డారు. విషయం గమనించిన పోలీసులు ఇద్దరు అభ్యర్థులను పోలింగ్ కేంద్రం నుంచి బయటకి పంపించేశారు.
కాంగ్రెస్, తెరాస జడ్పీటీసీ అభ్యర్థుల మధ్య వాగ్వాదం - ZPTC CANDIDATES
తుది విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ కేంద్రంలో వాగ్వాదం చెలరేగింది. ఇద్దరు జడ్పీటీసీ అభ్యర్థులు పరస్పరం గొడవకు దిగారు.
కాంగ్రెస్, తెరాస జడ్పీటీసీ అభ్యర్థుల మధ్య వాగ్వాదం