దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తికమాసం సందర్భంగా భక్తులు కాసుల వర్షం కురిపించారు. వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని కానుకలు సమర్పించారు.
కార్తికమాసంలో... రాజన్న ఆలయంలో కురిసిన కాసుల వర్షం - vemulawada rajanna temple hundi income
కార్తికమాసంలో వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు రికార్డు స్థాయిలో కానుకలు సమర్పించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సైతం అధిక స్థాయిలో కానుకలిచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆర్జిత సేవలు నిలిపివేయకుంటే మరింత ఆదాయం వచ్చేదని వెల్లడించారు.
నవంబర్ 16వ తేదీనుంచి ఈనెల 14వ తేదీ వరకు కార్తికమాసం కొనసాగగా... ఆలయంలోని వివిధ భాగాల నుంచి రికార్డు స్థాయిలో రూ.6.58 కోట్ల ఆదాయం సమకూరింది. ఇంకా పూర్తి స్థాయిలో హుండీలను లెక్కించాల్సి ఉందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. గత సంవత్సరం కార్తికమాసంలో హుండీలు, ఆర్జిత సేవలతో కలిపి రూ.7.81కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. ఈసారి కరోనా ప్రభావంతో గర్భాలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశామని... లేకుంటే మరితం ఆదాయం సమకూరేదని తెలిపారు.
ఇదీ చూడండి:నిబంధనలు గాలికొదిలేశారు.. స్కూల్లో పరీక్షలు నిర్వహించేశారు..!