వేములవాడ రాజన్న హుండీల ఆదాయం రూ.98. 26 లక్షలు - వేములవాడ వార్తలు
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో అధికారులు హుండీ లెక్కింపు చేపట్టారు. 51 రోజులకు గానూ... రూ.98 లక్షల 26 వేల నగదు ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
vemulawada rajanna hundi count updates
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో హుండీల లెక్కింపు చేపట్టారు. 51 రోజుల్లో హుండీల ఆదాయం రూ.98.26 లక్షలు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. బంగారం 190.500 గ్రాములు, వెండి 3 కిలోల 900 గ్రాముల కానుకలను భక్తులు రాజన్నకు సమర్పించుకున్నారు. ఆలయ ఓపెన్లో హుండీ డబ్బుల లెక్కింపు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు.