కార్తికమాసంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి హుండీ ఆదాయం రికార్డు సృష్టించింది. ఐదు రోజుల భక్తుల కానుకలను లెక్కించగా రూ.1,21,27,320 నగదు, 100 గ్రాముల బంగారం, 9.1 కిలోల వెండి వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
వేములవాడ హుండీ ఆదాయం ఎంతో తెలుసా...! - రికార్డు స్థాయిలో వేములవాడ హుండీ ఆదాయం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రికార్డుస్థాయిలో నమోదైంది. ఐదు రోజుల్లో వచ్చిన భక్తుల కానుకలను లెక్కించగా రూ.1,21,27,320 నగదు, 100 గ్రాముల బంగారం, 9.1 కిలోల వెండి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
రికార్డుస్థాయిలో వేములవాడ హుండీ ఆదాయం
చివరి రోజు భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. గత సంవత్సరం కార్తికమాసంలో హుండీలు, ఆర్జిత సేవలతో కలిపి రూ.7.81కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు. ఈసారి కరోనా ప్రభావంతో గర్భాలయంలో ఆర్జిత సేవలు నిలిపివేశామని... లేకుంటే మరింత ఆదాయం సమకూరేదని తెలిపారు.