రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ధర్మగుండంలో భక్తులు స్నానాలు చేసి, దర్శనం కోసం బారులు తీరారు. ఆలయంలో భక్తుల రద్దీతో ఆర్జిత సేవలు రద్దు పరచి శీఘ్ర దర్శనాలు అమలు పరిచారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు కోడెమొక్కులు చెల్లించుకున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ - రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం రెండవ సోమవారం సందర్భంగా భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూ కట్టారు.
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ