సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం తెరాసకే ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. చెప్పినవే కాకుండా చెప్పని పనులు కూడా ఎన్నో చేశామని పేర్కొన్నారు. సిరిసిల్లను ఆదర్శ మున్సిపాలిటీగా నిలిపామని చెప్పారు. జాతీయస్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయని తెలిపారు.
ఓటు అడిగే హక్కు కేవలం తెరాసకే ఉంది: కేటీఆర్
సిరిసిల్ల పురపాలిక ఎన్నికల మేనిఫెస్టోను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విడుదల చేశారు. సిరిసిల్లలో ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు కౌన్సిలర్లకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. సిరిసిల్లలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేశామని తెలిపారు. తాము చేసిన అభివృద్ధిని పుస్తక రూపంలో విడుదల చేశారు.
ktr
దేశంలో అత్యున్నత మున్సిపాలిటీగా సిరిసిల్లను తీర్చిదిద్దే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మభ్యపెట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఓటర్లకు సూచించారు. సిరిసిల్ల పురపాలిక ఎన్నికల మేనిఫెస్టోను కేటీఆర్ విడుదల చేశారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ సవాల్ని స్వీకరిస్తున్నా... పుర ప్రచారానికి 'బయటికి' రాను!
Last Updated : Jan 15, 2020, 7:37 PM IST