ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు సంక్షేమం కోసమే కొత్త రెవెన్యూ చట్టం: సెస్​ ఛైర్మన్​ - revenue act-2020

రైతుల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్​ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని సెస్ ఛైర్మన్ లక్ష్మారెడ్డి అన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెరాస మండల అధ్యుక్షుడు రాజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్నారు.

tractor rally at thangallapally in rajanna sirisilla district
రైతు సంక్షేమం కోసమే కొత్త రెవెన్యూ చట్టం: సెస్​ ఛైర్మన్​
author img

By

Published : Sep 23, 2020, 11:00 AM IST

కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో తెరాస మండల అధ్యుక్షుడు రాజన్న ఆధ్వర్యంలో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెస్​ ఛైర్మన్ లక్ష్మారెడ్డి హాజరయ్యారు. రైతుల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్​ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని చెప్పారు.

ఒకే కార్యాలయంలో పట్టాదారు పాస్ బుక్, రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చట్టం తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగేల మానస, సర్పంచ్ అనిత పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రైల్వే ఉద్యోగి పారాగ్లైడింగ్​ విన్యాసాలు

ABOUT THE AUTHOR

author-img

...view details