తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.9 కోట్లు తగ్గిన వేములవాడ రాజన్న ఆదాయం - vemulawada temple

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.108 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకు ముందు కంటే రూ.8.7 కోట్లు తగ్గింది.

రూ.9 కోట్లు తగ్గిన వేములవాడ రాజన్న ఆదాయం

By

Published : Apr 13, 2019, 11:42 AM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 108 కోట్ల ఆదాయం సమకూరింది. ఆలయంలో వేతనాలు వివిధ ఖర్చులు పోగా నికర ఆదాయం 49.61కోట్లుగా చేకూరింది. గత ఆర్థిక సంవత్సరంలో అందిన ఆదాయం కంటే ఈ సంవత్సరం 8.7 కోట్లు తగ్గింది. 2017 -18 లో నికర ఆదాయం రూ.58 .18 కోట్లు

ప్రధానంగా హుండీ లెక్కింపు ద్వారా 18.9 కోట్లు. కోడె మొక్కుల ద్వారా 7.9కోట్లు, ఆర్జిత సేవల నుంచి 5.4 కోట్లు, అద్దెలు అనుమతుల ద్వారా 3.8 కోట్లు. తలనీలాల లైసెన్సుల నుంచి రూ.3.6 కోట్లు, నగదు డిపాజిట్లు బంగారంపై వడ్డీ 3.7 కోట్లు, ప్రత్యేక దర్శనాలు ద్వారా 2.10కోట్ల ఆదాయం అందింది.

తెలంగాణ రాష్ట్రంలో అన్ని దేవాలయాల కంటే వేములవాడ రాజన్న ఆలయ ఆదాయం అధికంగా ఉందని ఈవో రాజేశ్వర్ తెలిపారు. రాబోయే రోజుల్లో భక్తుల కోసం మరిన్ని వసతులు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.

రూ.9 కోట్లు తగ్గిన వేములవాడ రాజన్న ఆదాయం

ఇవీ చూడండి:భక్తజన సంద్రమైన వేములవాడ ఆలయం

ABOUT THE AUTHOR

...view details