తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజన్న సన్నిధిలో దొంగను పట్టుకున్న భద్రతా సిబ్బంది' - SRI RAJA RAJESHWARA SWAMY

రాజన్న ఆలయంలో భక్తులు స్నానాలు చేస్తుండగా ఓ వ్యక్తి సెల్​ఫోన్లు దొంగలించాడు. భక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు.

యువకుడిని పోలీస్ ఠాణాలో  అప్పగించిన భద్రతా సిబ్బంది

By

Published : Jun 18, 2019, 6:13 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో చోరీ జరిగింది. భక్తుల సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ధర్మగుండం వద్ద సెల్ ఫోన్లు దొంగతనం చేస్తుండగా గమనించిన భక్తులు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. యువకుడిని పరిశీలించిన సిబ్బంది వేములవాడ స్థానిక పోలీస్ ఠాణాలో అప్పగించారు.

సెల్​ఫోన్ల దొంగను పట్టుకున్న ఆలయ భద్రతా సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details