రాజన్న సిరిసిల్లలో కొత్తగా నిర్మిస్తున్న పాలనాధికారి కార్యాలయ భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 30 ఎకరాల్లో కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులకు ప్రభుత్వం 33 కోట్ల నిధులు మంజూరు చేసింది. నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. 100పైగా గదుల నిర్మాణంతో పాటు భారీ స్థాయిలో మీటింగ్ హాల్ నిర్మిస్తున్నారు.
వేగంగా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం పనులు - ktr
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గత ఏడాదిన్నర క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
నిర్మాణంలో ఉన్న కలెక్టర్ కార్యాలయం