తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈత కొలనులో చిన్నారుల చిందులు - summar

అసలే ఎండకాలం... సూర్యుడి వేడికి చెమటలు కక్కిస్తున్నాడు. ఈ సమయంలో చల్లని నీళ్లలో ఈత కొడుతూ ఉంటే ఆ సరదానే వేరు కదా... అలా చిన్నారులంతా ఓ ఈత కొలనులో కేరింతలు కొడుతూ.. ఉల్లాసంగా గడుపుతున్నారు. అదేక్కడో మనమూ ఓసారి చూసొద్దామా?

ఈత కొలనులో చిన్నారుల చిందులు

By

Published : Apr 18, 2019, 3:09 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈత కొలనులో చిన్నారులు చిందులేస్తున్నారు. చల్లని నీళ్లలో కేరింతలు కొడుతూ... సరదా తీర్చుకుంటున్నారు. అందులోనూ వేసవి సెలవులోచ్చేశాయ్. ఇక పిల్లల ఆటలకు హద్దులుండవు. ఈత నేర్చుకోవడమే కాదు.. సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేసుకుంటున్నారు.

సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈతకొలనులో చిన్న, పెద్ద తేడా లేకుండా నీటిలో సంతోషంగా గడుపుతున్నారు. నీళ్లపై కాళ్లను ఆడిస్తూ.. చేతులతో నీటిని కిందికి తోస్తూ ముందుకు సాగి పోవడం వల్ల చేప లాంటి అనుభూతిని కలుగుతుందని చిన్నారులు చెబుతున్నారు. భవిష్యత్తులో నీటిని చూసి భయ పడే పరిస్థితులు ఉండవని నిర్వహకులు చెబుతున్నారు. నీటిలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఒడ్డుకు చేరే ఆత్మస్థైర్యంతో పాటు శరీరానికి మంచి వ్యాయామంగా ఈత ఉపయోగపడుతుందంటున్నారు.

ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్విమ్మింగ్ పూల్ తెరిచి ఉంటుందని నిర్వాహకులు చెప్పారు.

ఈత కొలనులో చిన్నారుల చిందులు

ABOUT THE AUTHOR

...view details