తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతిపక్షం లేకుండా చేయడమేంటి?' - congress

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవాడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో హస్తం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.

కాంగ్రెస్ నాయకులు నిరసన

By

Published : Jun 7, 2019, 1:12 PM IST

ప్రతిపక్షాన్ని విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్​లో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి యత్నించగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం లేని ప్రభుత్వం లేదని, తెలంగాణలో మాత్రం ప్రతిపక్షం లేకుండా కేసీఆర్, కేటీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు.

కాంగ్రెస్ నాయకులు నిరసన

ABOUT THE AUTHOR

...view details