రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా సందడి నెలకొంది. ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి చతుషష్టి ఉపచార పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా దర్శనాలు చేసుకుంటున్నారు. ఆలయంలో ఆర్జిత సేవలు, కోడె మొక్కులు రద్దు చేసి భక్తులకు శీఘ్ర దర్శనం అమలు చేశారు. ఆన్లైన్ ద్వారా పూజలను బుక్ చేసుకున్న భక్తుల పేరిట అర్చకులు ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.
రాజన్న ఆలయంలో శ్రావణమాసం సందడి - శ్రావణమాసం పూజలు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా సందడి నెలకొంది. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్జిత సేవలు, కోడె మొక్కులు రద్దు చేసి భక్తులకు శీఘ్ర దర్శనం అమలు చేశారు.
రాజన్న ఆలయంలో శ్రావణమాసం సందడి
పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మహాలక్ష్మి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణను రద్దు చేసి, దర్శనానికి మాత్రమే భక్తులకు ఆలయ అధికారులు అనుమతి కల్పించారు.
ఇవీ చూడండి:శ్రావణ మాస వాయనాల్లో సెనగలు ఎందుకు వాడతారంటే..