రాజన్న సిరిసిల్లా జిల్లాలో గురువారం నిర్వహించిన శ్రీశివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. మార్కండేయ దేవాలయం నుంచి బయలు దేరిన శోభాయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా కొనసాగింది. శోభాయాత్రలో మగ్గంపై నేసిన చేనేత వస్త్రాన్ని స్వామి వారికి సమర్పించడం నూలు పౌర్ణమి ప్రత్యేకత. పద్మశాలీల కులదైవమైన మార్కండేయ స్వామి అనుగ్రహంతో సిరిసిల్ల సిరుల ఖిల్లాగా మారుతుందని, పద్మశాలీ వంశీయులకు స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటాయని ఎంపీ అన్నారు.
శోభాయమానంగా మార్కండేయ స్వామి శోభాయాత్ర - మార్కండేయ స్వామి
నూలు పౌర్ణమి సందర్భంగా శ్రీశివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో గురువారం అత్యంత శోభాయమానంగా నిర్వహించారు.
శోభాయమానంగా మార్కండేయ స్వామి శోభాయాత్ర
Last Updated : Aug 16, 2019, 11:47 AM IST