తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇక శివనామస్మరణే..! - GOVERNMENT

మహాశివరాత్రి జాతరలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానిది ప్రముఖ స్థానం. జాతరర ఏర్పాట్లపై ఆలయ అధికారులు దృష్టిపెట్టారు. మార్చి 3 నుంచి జరిగే వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం 5లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు.

ఇక శివనామస్మరణే..!

By

Published : Feb 27, 2019, 6:19 PM IST

ఇక శివనామస్మరణే..!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. 2 కోట్ల రూపాయలతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 3 నుంచి 5 వరకు ఉత్సవాలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఏటా శివరాత్రికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇందుకోసం ఐదు లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు.

ఇవీ చదవండి:నోరూరించే వంటకాలు

ఆలయ పరిసరాల్లో భక్తులకు నీడకల్పించేందుకు ఇప్పటికే చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాకారాలకు రంగులు వేయడం, తాగునీరు, పారిశుద్ధ్యం, క్యూలైన్ల క్రమబద్ధీకరణ పనులు చేపట్టినట్లు ఈవో దూస రాజేశ్వర్​ తెలిపారు.

ఇవీ చదవండి:విద్యార్థుల వినూత్న ప్రయోగాలు

భక్తులకు త్వరగాదర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని ఈవో చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details