సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని దేశంలోనే మొట్టమొదటి సారిగా అటవీశాఖ అధికారులు డ్రోన్ల సహాయంతో విత్తన బంతుల ప్రయోగం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండలం రాసిగుట్ట ప్రాంతంలో సుమారు 15 వేల విత్తన బంతులను మారుతీ డ్రోన్ సంస్థ సహాయంతో అధికారులు చల్లారు. ఒక్కరోజులో లక్ష సీడ్ బాల్స్ వేసే సామర్థ్యం ఉన్న డ్రోన్ల సహాయంతో 50 అడుగుల ఎత్తు నుండి బంతులను జారవిడిచారు.
అటవీశాఖ వినూత్న ప్రయోగం... డ్రోన్లతో విత్తనాలు - అటవీశాఖ వినూత్న ప్రయోగం... డ్రోన్లతో విత్తనాలు
డ్రోన్ల సహాయంతోనే విత్తనాలు చల్లే టెక్నాలజీని అటవీశాఖ అధికారులు సిరిసిల్లలో ప్రయోగించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా... ఈ ప్రయోగాన్ని అధికారులు నిర్వహించారు. డ్రోన్ల సహాయంతో 15 వేల విత్తన బంతులను చల్లారు.
SEEDS SPRINKLING WITH DRONES IN SIRICILLA
ఒక్కసారి 400 విత్తన బంతులు మోసుకెళ్ళి... సెకనుకు ఒక బంతి చొప్పున అన్ని బంతులను జారవిడిచేలా డ్రోన్లను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా డ్రోన్ల సహాయంతో 15 వేల విత్తన బంతులను జారవిడిచినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏడాది తర్వాత జియో ట్యాగింగ్‌తో ఎన్ని మొక్కలు బతికి ఉన్నాయో గుర్తించవచ్చని మారుతి డ్రోన్ సంస్థ సీఈఓ ప్రేమ్ కుమార్ తెలిపారు.
ఇవీ చూడండి:ట్విట్టర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే కేసీఆర్
TAGGED:
KCR BIRTHDAY CELEBRATIONS