రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయం ముందు భాజపా నాయకులు కేంద్రం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏకమొత్తంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించిన ప్రభుత్వం అమలులో విఫలమవుతోందని ఆరోపించారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ప్రభుత్వం రుణమాఫీ నేరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటనష్టం, రైతుబంధు రాలేక రైతులు అల్లాడిపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భాజపా మండలాధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, నాగసముద్రాల సంతోష్, నాగరాజు, అవినాష్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
రుణమాఫీ అమలు చేయడం లేదని ధర్నా - ధర్నా
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఇల్లంతకుంట మండల కేంద్రంలో భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ప్రభుత్వం రుణమాఫీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రుణమాఫీ అమలు చేయడం లేదని ధర్నా