శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం Reconstruction Of Sri Venkateshwara Temple In Sircilla : తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న సిరిసిల్ల శ్రీలక్ష్మీ వేకంటేశ్వరస్వామి ఆలయానిది 800 ఏళ్ల ఘన చరిత్ర. పూర్వం సిరిసిల్లను శ్రీశాల అనేవారు. కాలక్రమేనా సిరిసిల్లగా పిలుస్తున్నారు. తొలుత ఇక్కడ శ్రీ కేశవనాథస్వామి పూజలందుకున్నారు. కాకతీయుల కాలంలో దండయాత్ర చేసిన మొగలాయిలు ఇక్కడి కేశవనాథస్వామి వారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత శ్రీశాల సర్దేశాయి చెన్నమనేని తుక్కారావు, మీనారావులకు మాండవ్య నదీ తీరాన.. అచ్చం తిరుమలలో కొలువైన, శ్రీవారిని పోలిన విగ్రహం లభించింది. వజ్రదంతి వృక్షం కింద లభించిన స్వామివారి విగ్రహాన్ని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి నామముతో దేవాలయంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి సిరిసిల్ల ఆలయంలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి నామంతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
Sircilla Sri Venkateshwara Temple Latest :మొగలాయిలు ధ్వంసం చేసిన శ్రీ కేశవనాథ విగ్రహం ఇప్పటికీ ఆలయ వాహనశాలలో భద్రంగా ఉంది. దశాబ్దాలుగా ఆలయ పునర్వైభవం కోసం భక్తులు పెట్టుకుంటున్న మొరను రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆలకించాయి. రూ.2 కోట్ల 63 లక్షల నిధులతో చేపట్టే ఆలయాభివృద్ధి పనులకుమంత్రి కేటీఆర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు.
Sircilla Sri lakshmi Venkateswara Swamy Temple News : సిరిసిల్ల శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామికి ప్రతి ఏటా అశ్వీయుజ శుద్ధ సప్తమి నుంచి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి మాదిరిగానే ఇక్కడా.. ఆ బ్రహ్మాండ నాయకుడికి వాహన సేవలు ఉన్నాయి. తిరుమల తిరు మాడవీధుల్లో ఊరేగినట్లే.. సిరిసిల్లలోనూ శ్రీవారు ఉభయదేవేరుల సమేతుడై పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.
Reconstruction Of Sircilla TTD Temple : ప్రతియేడు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో శేష, హంస, సింహ, అశ్వ, గరుడ, హన్మంత, గజ, సూర్య, చంద్ర, కాళింగమర్ధన, రంగనాయక తిరుప్పోలం, పొన్నవాహనాలపై శ్రీ శ్రీనివాసుడు భక్తులకు అభయహస్తం అందిస్తారు. బ్రహోత్సవాల్లో పొన్నవాహన సేవకు ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణుడి లీలామృతాల్లో ఒకటైన గోపికా వస్త్రాపహరణ ఘట్టాన్ని ఆవిష్కరించే ఈసేవ అత్యంత రమణీయంగా ఉంటుంది. తిరుమల మాదిరిగా ఉన్న వాహన సేవలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. మంత్రి కేటీఆర్‌తో కలసి తిలకించారు.
Reconstruction Of Sircilla Sri Venkateshwara Temple :సిరిసిల్ల శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామికి రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన రథం ఉంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన ఈ రథోత్సవం ఆశ్వీయుజ పౌర్ణమి రోజు నిర్వహిస్తారు. వేకువజామున 5 గంటలకే రథంపైకి వేంచేసే శ్రీవారి దర్శనం కోసం వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. ఆ ఒక్కరోజే సుమారు 50 వేల మందికి పైగామొక్కులు తీర్చుకుంటారు. సాయంత్రం 4 గంటలకు ఆలయం చుట్టూ ఉన్న వీధుల్లో విహరిస్తూ రెండు గంటల పాటు భక్తులను అనుగ్రహిస్తారు.
Reconstruction Of TTD Temple In Sircilla :గోవిందనామ స్మరణతో రథాన్ని లాగేందుకు వేలాది మంది భక్తులు పోటీపడే సన్నివేశం నయనానందంగా సాగుతుంది. రథంపై శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల్లో విశ్వాసం. రథంపై శ్రీవారి దర్శనం వల్లే తాము వివిధ హోదాల్లో స్థిరపడ్డామని చెబుతారు. సిరిసిల్ల శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం పునఃనిర్మాణ పనుల ప్రారంభం పట్ల స్థానికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పునర్నిర్మాణం తర్వాత ఆలయం.. నవీన ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతుందన్న విశ్వాసం వ్యక్తం అవుతోంది.
ఇవీ చదవండి: