వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటం వల్ల వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భక్తజనంతో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ధర్మ గుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల ఆర్జిత సేవలు రద్దు పరిచి శీఘ్ర దర్శనాలు అమలుపరిచారు.
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ - rajanna temple
వేములవాడ రాజన్న స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి ముగియడం వల్ల వివిధ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు.
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ