టెక్స్టైల్ పార్క్‌లో వార్పిన్ కార్మికులకు ప్రస్తుతం మీటర్‌కు ఇస్తున్న 31 పైసలు కూలీ సరిపోవడం లేదని... రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి వార్పిన్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడు బడుగు యాదగిరి తెలిపారు. ప్రభుత్వ వస్త్రాలు, బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా అదనంగా కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఇప్పటికే అనేక సార్లు పరిశ్రమల యజమానులను అడిగినా పట్టించుకోలేదన్నారు.
కూలీ రేటు పెంచాలని వార్పిన్ కార్మికుల సమ్మె
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టెక్స్టైల్ పార్క్ వార్పిన్ కార్మికుల సమావేశం నిర్వహించారు. టెక్స్ టైల్ పార్క్‌లో ప్రస్తుతం ఇస్తున్న కూలీ రేటు తమకు గిట్టుబాటు కాదని.. ఇక నుంచి పని చేయమని... తీర్మానం చేసినట్లు వార్పిన్ కార్మికులు తెలిపారు.
కూలీ రేటు పెంచాలని వార్పిన్ కార్మికుల సమ్మె
అందుకే ఈ నెల 5 నుంచి సమ్మె చేస్తున్నామని ఆయన అన్నారు. కార్మికుల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు యాజమాన్యం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కూలీ పెంచేందుకు ముందుకు రాకపోవడం వలన కార్మికులందరూ తమ పనులు వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆసరా పింఛన్లకు రూ. 11 వేల 508 కోట్లు మంజూరు