రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాని(Rain)కి సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు, జిల్లాలోని పలు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీరు చేరి ధాన్యం తడిసిపోయింది. సిరిసిల్ల పట్టణంలోని కొత్తచెరువు, పాతబస్టాండ్ ,సంజీవనగర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో మురికి నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
Rain: కురిసిన వర్షం-తడిసిన ధాన్యం - రాజన్న సిరిసిల్ల్ జిల్లా వార్తలు
కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీటి(Rain) పాలవుతుంటే అన్నదాతలు ఏం చేయలేని స్థితిలో కన్నీరు కారుస్తున్నారు. అమ్ముకుందామని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొస్తే కొనడం ఆలస్యమవటంతో పంట తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది.
Rain: కురిసిన వర్షం-తడిసిన ధాన్యం
కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యంపై టార్పాలిన్లు కప్పినప్పటికీ వర్షపు నీరంతా ధాన్యం కుప్పలలోకి చేరడంతో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి:KTR: కేంద్ర అనాలోచిత నిర్ణయాల వల్లే వ్యాక్సిన్ ఆలస్యం: కేటీఆర్