వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాతపద్ధతిలోనే చేపట్టాలంటూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని స్థిరాస్తి వ్యాపారులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వీరికి మద్దతుగా నిలుస్తూ.. ద్విచక్రవాహన ర్యాలీలో పాల్గొన్నారు.
'ఎల్ఆర్ఎస్తో దోచుకోవడం సరికాదు'
ఎల్ఆర్ఎస్ రద్దును డిమాండ్ చేస్తూ.. వేములవాడ పట్టణంలోని స్థిరాస్తి వ్యాపారులు రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
'ఎల్ఆర్ఎస్తో దోచుకోవడం సరికాదు'
ఎల్ఆర్ఎస్ విధానం.. నిరుపేదలకు ఇబ్బందిగా మారిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని దోచుకోవడం సరికాదన్నారు.
ఇదీ చదవండి:'ఎల్ఆర్ఎస్ రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగించండి'