తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ గ్రామ పంచాయతీలకు ప్రధానీ మోదీ అభినందనల వెల్లువ - Prime Minister Modi congratulations to the best village panchayats

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దూరదృశ్య మాధ్యమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ పురస్కరాలకు ఎంపికైన గ్రామ పంచాయతీలకు మోదీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని అధికారులకు సూచించారు.

award presentation to best village panchayats
ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డుల ప్రదానం

By

Published : Apr 24, 2021, 9:24 PM IST

గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, పంచాయతీల పనితీరు భేష్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ సమీక్షించారు. ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కలెక్టర్ కృష్ణ భాస్కర్, అదనపు కలెక్టర్​ బి.సత్యప్రసాద్​, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, పంచాయతీ అధికారి రవీందర్, గ్రామీణాభివృద్ధి అధికారి కౌటిల్య తదితరులు పాల్గొన్నారు. జాతీయ పంచాయతీ పురస్కారాలకు ఎంపికైన ముస్తాబాద్ మండలం మోహిని కుంట సర్పంచ్​ కల్వకుంట్ల వనజ, ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్​ సర్పంచ్ తెడ్డు అమృత హాజరయ్యారు.

నేరుగా నిధులు మంజూరు

కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేస్తోందని మోదీ తెలిపారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ పంచాయతీ పురస్కారాలకు ఎంపికైన గ్రామ పంచాయతీలకు సమావేశం నుంచే నేరుగా ఆన్​లైన్​లో నిధులు విడుదల చేశారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది దూరదృశ్య మాధ్యమం ద్వారా అవార్డుల ప్రదానం చేశారు. అవార్డుకు సంబంధించిన షీల్డు, సర్టిఫికెట్లను ముందుగానే జిల్లాలకు పంపించారు. విజేతలకు ఈ సమావేశంలో అవార్డులను అందించారు.

ఇదీ చదవండి:నిబంధనలు ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలు: ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details