రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేటకు చెందిన 13మంది వికలాంగులకు మూడు నెలలుగా పింఛన్ రాలేదని ఎంపీడీఓకు మొరపెట్టుకున్నారు. దీనిపై అధికారులు ఆరా తీయగా లబ్ధిదారుల డబ్బులు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కల్వయ్ గ్రామానికి చెందిన సత్యనారాయణ ఖాతాలోకి మళ్లించుకున్నట్టు గుర్తించారు. పెన్షన్ ఖాతాలు హ్యాక్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్నుంచి 40 వేలు రికవరీ చేసినట్లు ఎంపీడీవో మదన్మోహన్ తెలిపారు.
దివ్యాంగుల పింఛన్లు స్వాహా చేసిన ప్రబుద్ధుడు - physically chalenged
దివ్యాంగుల పింఛన్ ఖాతాలు హ్యాక్ చేసి సొంత ఖాతాలో జమ చేసుకుంటున్న ఓ ప్రబుద్ధుడి వైనం రాజన్న సిరసిల్లలో వెలుగు చూసింది.
దివ్యాంగుల పింఛన్లు స్వాహా చేసిన ప్రబుద్ధుడు