సిరిసిల్ల శాంతి నగర్‌కు చెందిన ఎనగందుల వెంకటేశం అనే వ్యక్తి గడ్డం నాగరాజు అనే వ్యక్తి ఇంటి ఎదుట అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గడ్డం నాగరాజు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశంకు 45 లక్షల రూపాయల విలువగల భూమి విక్రయించి... దాని తాలూకు రిజిస్ట్రేషన్‌ను చేయకుండా ఏడాదిగా తప్పించుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి
ఎనగందుల వెంకటేశం అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి
గడ్డం నాగరాజు, ఆరిఫ్లు డబ్బులు తీసుకొని కూడా భూమి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. వెంకటేశం మరణించిన తర్వాతే గడ్డం నాగరాజు తన ఇంటికి తాళం వేసి పారిపోయాడని చెప్పారు. కుటుంబ సభ్యులు మృతదేహంతో నాగరాజు ఇంటి ఎదుటనే బైఠాయించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: బోరిగాంలో మహిళా దారుణ హత్య