'రాజరాజేశ్వర' పనులపై న్యాయవిచారణకు డిమాండ్ - mlc jeevan reddy press meet
రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర జలాశయాన్ని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పరిశీలించారు. నాణ్యత లోపంతో మట్టికట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రాజరాజేశ్వర ప్రాజెక్టు నాణ్యత లోపంపై న్యాయవిచారణ జరపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నాడు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. స్పిల్‌వే మరమ్మతు పనులు చేపట్టిన ప్రభుత్వం.. నాణ్యత లోపంపై స్పందించడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు భోగం ఒర్రె జలాశయం ఉన్న మేరకు మట్టి తొలగించలేదన్నారు. ప్రాజెక్టులో 26 టీఎంసీల మేర నీటిని నింపితే మట్టికట్ట కొట్టుకు పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. ఆయన వెంట టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం, సీనియర్ నాయకులు ఆది శ్రీనివాస్ ఉన్నారు.
- ఇవీచూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష