కరోనా వ్యాపించకుండా విశేష కృషి చేస్తున్నఅధికారులు కూడా తప్పనిసరిగా వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ అంజయ్య అకాల మరణం పట్ల ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
'అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి' - boinpalli mandal news
కొవిడ్ కట్టడి కోసం విధులు నిర్వహిస్తున్నఅధికారులు కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో భాగంగా ఆయన అధికారులతో చర్చించారు.
'అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి'
ప్రజాసేవలో అధికారులు దగ్గరుండి విధులు చేపట్టే సందర్భాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు గ్రామాల్లో కరోనా పీడితులకు సహాయం చేస్తూ మనోధైర్యం కల్పిస్తున్నారని కొనియాడారు. యాసంగి వరి పంట కొనుగోలు మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.