తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈమె కేసీఆర్‌కు హార్డ్‌కోర్‌ ఫ్యాన్... నాకు గట్టి మద్దతుదారు..: కేటీఆర్ - ఈమె కేసీఆర్‌కు హార్డ్‌కోర్‌ ఫ్యాన్

సీఎం కేసీఆర్​కు వీరాభిమాని ఈమేనంటూ.. కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. తనకు గట్టి మద్దతుదారు అంటూ జిందం సత్తమ్మను ప్రపంచానికి పరిచయం చేస్తూ... ట్విటర్​లో పోస్టు పెట్టారు.

TRS HARDCORE FAN SATTAMMA
ఈమె కేసీఆర్‌కు హార్డ్‌కోర్‌ ఫ్యాన్... నాకు గట్టి మద్దతుదారు..: కేటీఆర్

By

Published : Jul 18, 2022, 9:01 AM IST

'తెరాసకు, కేసీఆర్‌కు వీరాభిమాని, నాకు గట్టి మద్దతుదారు ఈ జిందం సత్తమ్మ' అని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తూ పోస్టు పెట్టారు. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన సత్తమ్మ సీఎం కేసీఆర్‌ హార్డ్‌కోర్‌ అభిమాని అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె క్రియాశీలక భాగస్వామ్యమని, సిరిసిల్ల నియోజకవర్గంలో నాకు గట్టి మద్దతుదారు కూడా అంటూ మంత్రి కేటీఆర్‌ ఆదివారం తన వ్యక్తిగత ట్విటర్ ఖాతాలో సత్తమ్మ గురించి రాశారు. ఆమెతో ఉద్యమ సమయంలో, మంత్రిగా వివిధ సందర్భాల్లో కలిసిన ఫొటోలను ఉంచారు.

ABOUT THE AUTHOR

...view details