రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జరిగిన బస్సు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలను వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సంతాపాలు, పరామర్శలకే పరిమితం కాకూడదని ఎంపీ బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవరించాలని అధికారులకు సూచించారు.
బస్సు ప్రమాద బాధితులకు మంత్రి, ఎంపీ పరామర్శ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్ పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
బస్సు ప్రమాద బాధితులను మంత్రి, ఎంపీ పరామర్శ
Last Updated : Aug 28, 2019, 8:50 PM IST