కోటి ఎకరాల మాగాణి దిశగా వేసిన జలబాటల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. కరవు సీమలో నూతన శోభను నింపేందుకు కాళేశ్వర గంగమ్మ ఉప్పొంగుతోంది. మొన్నటి వరకు ఎడారిని తలపించిన మానేరు వాగులో జలసవ్వడి పరవళ్లు తొక్కుతోంది. మధ్యమానేరు నుంచి సిరిసిల్ల మానేరువాగులోని గంగమ్మ... ఆలయ చెంతకు చేరింది. మానేరు వంతెన నుంచి 2 కిలోమీటర్ల మేరకు నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సిరిసిల్లలో పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మ అందాలను వీక్షిస్తూ జిల్లావాసులు పరవశించిపోతున్నారు.
డ్రోన్‌తో తీసిన మానేరు అందాలు.. మీరూ చూడండి! - Kaleshwaram project rivers
జలబాటల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. కాళేశ్వర గంగతో కరవుసీమలో నూతనశోభ సంతరించుకుంది. సిరిసిల్లలోని గంగమ్మచెంతకు కాళేశ్వరజలాలు ఉప్పొంగుతున్నాయి. మానేరు డ్రోన్ అందాలు మీ కోసం...
mid manair river