రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని వేములవాడలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. వట్టెంల గ్రామానికి చెందిన గొల్లపల్లి వినోద్ ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎంపీటీసీ టికెట్ రాకపోవడం వల్ల తన డిమాండ్లను కాగితంపై రాసుకుని ట్యాంక్ ఎక్కాడు. రెండు గంటలపాటు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు వినోద్‌ను కిందకు దింపారు.
టికెట్ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన - mptc
డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. దాదాపు రెండు గంటల అనంతరం అతడిని పోలీసులు కిందకు దింపారు.
ట్యాంక్‌పై వినోద్