తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించారు. వెంకంపేటలో నిర్మించిన పలు కమ్యూనిటీ హాళ్లతో పాటు కొత్తగా నిర్మించిన పార్కును ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు. పద్మశాలి సంఘం కొత్తకార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న కేటీఆర్..చేనేత పరిశ్రమను సాధ్యమైనంత మేర వృద్ధి చేసి ఉపాధి మార్గాలను మెరుగు పర్చాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. తిరువూరులో ఏటా 36వేల కోట్ల వస్త్రవ్యాపారం జరుగుతుంటే సిరిసిల్లలో మాత్రం కేవలం 12వేల కోట్ల వ్యాపారం మాత్రమే జరుగుతోందన్నారు. చేనేత కుటుంబాలను ఆదుకొనేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించడానికైనా సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
సిరిసిల్లను తిరువూరు తరహాలో అభివృద్ధి చేస్తా: కేటీఆర్
సిరిసిల్ల చేనేత పరిశ్రమను తిరువూరు పరిశ్రమ తరహాలో అభివృద్ధి చేయాలన్నదే తన ప్రధాన ఉద్దేశమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కేటీఆర్