రాష్ట్రాన్ని పంటలతో సస్యశ్యామలం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. ముస్తాబాద్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్... సిరిసిల్లలో రైలు కూత వినిపించాలంటే 16 మంది తెరాస ఎంపీలను గెలిపించుకోవాలన్నారు. పాండవులు ఐదుగురే ఉన్నా... కురుక్షేత్రం గెలిచారని... అదే విధంగా సొంత పార్టీ ఎంపీలతో రాష్ట్ర అభివృద్ధికి కావల్సిన నిధులను కేంద్రం మెడలు వంచి తెచ్చుకోవచ్చని వివరించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్లకు రైలు రావాలంటే 16 ఎంపీలు గెలవాల్సిందే - MUSTABAD
"రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలిస్తే రాహుల్‌గాంధీకి మాత్రమే లాభం... భాజపా ఎంపీ అభ్యర్థులు గెలిస్తే మోదీకి మాత్రమే లాభం... కానీ తెరాస ఎంపీలు గెలిస్తే తెలంగాణ సమాజానికి లాభమైతది. ఇంటి పార్టీ సైనికులుంటే.. మనకు రావాల్సిన నిధులను మెడలు వంచి తెచ్చుకోవచ్చు"--- కేటీఆర్
ముస్తాబాద్ ప్రచార సభలో...