తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ గొప్ప పథకాలు: ఎమ్మెల్యే సుంకె - Kalyana Lakshmi, Shadi Mubarak Great plans: MLA Sunke

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ముఖ్య అతిథిగా హాజరై.. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

Kalyana Lakshmi, Shadi Mubarak Great plans: MLA Sunke
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ గొప్ప పథకాలు: ఎమ్మెల్యే సుంకె

By

Published : Aug 30, 2020, 11:58 AM IST

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొప్ప పథకాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన సుమారు 90 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రవేశపెట్టిన ఈ పథకాలు పేదింటి ఆడబిడ్డల పాలిట వరంలా మారాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పథకాలతో ఆడపిల్ల పెళ్లి చేసిన కుటుంబానికి ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో పలువులు స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి

ABOUT THE AUTHOR

...view details