రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు పెళ్లిలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో డయాలసిస్ విస్తరణ కేంద్రం, 50 పడకల కొవిడ్ వార్డ్, ఆక్సిజన్ ప్లాంట్, ఎక్స్రేరేకు సంబంధించిన అధునాతన యంత్రాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
సిరిసిల్ల ఆసుపత్రిలో నూతన సదుపాయాలు ప్రారంభించిన కేటీఆర్ - కేటీఆర్ తాజా వార్తలు
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రితోపాటు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణ, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్రావు, మున్సిపల్ ఛైర్పర్సన్ కళ ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్
ఆస్పత్రిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతకుముందు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘ భవనం, సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరులో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నేలకొండ అరుణ, టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్రావు, మున్సిపల్ ఛైర్పర్సన్ కళ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వరద బాధితులకు ఆర్థికసాయం ప్రక్రియ ప్రారంభం