తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడలో గుట్కా పట్టివేత - quid Catched By Police

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో దాచి ఉంచిన గుట్కాను జిల్లా టాస్క్​ఫోర్స్​ సీఐ రవీందర్​ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, స్వాధీనం చేసుకున్నారు. యాభైవేల రూపాయల గుట్కా స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.

Illegal Quid Occupaid by Task Force Police
వేములవాడలో గుట్కా పట్టివేత

By

Published : May 22, 2020, 11:19 PM IST

రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని కల్యాణ మండపంలో గుట్కా దాచి ఉంచారని సమాచారం అందుకున్న జిల్లా టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్​ఫోర్స్​ సీఐ రవీందర్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో రూ.50 వేల విలువైన గుట్కా స్వాధీనం చేసుకున్నారు.

వేములవాడ పట్టణంలోని కల్యాణ మండలంలో రహస్యంగా గుట్కా నిల్వ చేసిన శ్రీనివాస్, ఎల్లయ్యలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా అరకోటి దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details