కరోనా ఎఫెక్ట్: వడదెబ్బతో విధుల్లోనే హోంగార్డు మృతి - sunstroke
19:28 April 15
కరోనా ఎఫెక్ట్: వడదెబ్బతో విధుల్లోనే హోంగార్డు మృతి
కరోనా వైరస్ నివారణలో భాగంగా సిరిసిల్ల పట్టణంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సిలివేరి దేవయ్య ఎండ దెబ్బ తగిలి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి గ్రామానికి చెందిన సిలివేరి దేవయ్య(48) సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. కోర్టు డ్యూటీలో ఉన్న దేవయ్య ప్రస్తుతం కోర్టులు బందు ఉండడంతో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా పెట్రోలింగ్ డ్యూటీ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే బుధవారం విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై పట్టణ సీఐ వెంకటనర్సయ్యను వివరణ కోరగా ఎండ దెబ్బతో మృతిచెందినట్లు ఆయన తెలిపారు. మృతునికి భార్య భారతి, కుమారుడు, కూతురు ఉన్నారు.