తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్లలో మొక్కల పంపిణీకి పూర్తయిన ఏర్పాట్లు - రాజన్న సిరిసిల్ల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ప్రతి పల్లెలో మొక్కలు నాటేందుకు గ్రామల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అధికారులు మొక్కలను పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు.

మొక్కల పంపిణీకి పూర్తయిన ఏర్పాట్లు

By

Published : Apr 16, 2019, 10:10 PM IST

సిరిసిల్ల జిల్లాలోని గ్రామాలను హరిత వనంగా మార్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. నర్సరీల ద్వారా మొక్కలను పంపిణీ చేయనున్నారు. ప్రజలకు ఉపయోగపడే ఉసిరి, జామ, అల్లనేరేడు, గులాబీ, గన్నేరు, దానిమ్మ, సీతాఫలాలు, పండ్లు, పూలు నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నారు. వచ్చే జూన్, జూలైలో పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల మొక్కలు ఎండిపోకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో 50 వేల మొక్కలను పంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. తంగళ్లపల్లి, సిరిసిల్ల మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో 15 లక్షల మొక్కలు నాటనున్నారు.

మొక్కల పంపిణీకి పూర్తయిన ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details