తెలంగాణ

telangana

ETV Bharat / state

సిరిసిల్లలో విద్యుదాఘాతంతో రైతు మృతి - today crime news

వ్యవసాయ భూమిలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

former died in siricilla
విద్యుదాఘాతంతో రైతు మృతి

By

Published : Jul 21, 2020, 12:14 PM IST

వ్యవసాయ భూమిలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సిరిసిల్లలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన రైతు ఎర్ర నర్సయ్య... రోజులాగే వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు.

బోరు మోటర్ కు సంబంధించిన స్విచ్ ఆన్ చేయబోయి షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details