రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వేములవాడ పరిధిలోని కోనరావుపేట, చందుర్తి, బోయినపల్లి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని కర్షకులు ఆరోపించారు. సరైన వసతులు కల్పించక పోవడం వల్లే ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
'తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి'
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా... అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
'తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి'