రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. క్యూలైన్లలో భక్తులను పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. అధికారుల కుటుంబాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనాలు జరిగేందుకు సామాన్య ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు.
దాదాపు రెండు గంటలకుపైగా భక్తులను క్యూలైన్లలోనే నిలబెట్టిన అధికారులు చోద్యం చూస్తున్నారు. చంటి పిల్లాడితో ఇబ్బంది పడుతున్న ఓ తండ్రి ప్రాధేయపడిన పోలీసులు వినలేదు. ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలోనే పోలీసులకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు.
సామాన్య భక్తులకు నరకం:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్యూలైన్లలో నిల్చున్న భక్తులను పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. పోలీసులు, అధికారుల కుటుంబాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారి దర్శనాలు చేయిస్తున్నారు. క్యూలైన్లలో నిల్చున్న సామాన్య భక్తులకు మాత్రం రాజన్న దర్శనం గంటలకొద్దీ క్యూలో నిలుచుంటే తప్ప కావడం లేదు. రెండు గంటలుగా భక్తులని క్యూలైన్లలో నిలబెట్టి అధికారులు మాత్రం వీఐపీ దర్శనంలో మునిగితేలుతున్నారు.