Decades of tree Tree Transplantation at Suddala : 70 ఏళ్ల కిందట నాటి మర్రి వృక్షం... ఈదురు గాలుల బీభత్సానికి కుప్పకూలింది. వంట చెరుకుగా మారే పరిస్థితి నుంచి... ఓ ప్రకృతి ప్రేమికుడి కృషితో.. మళ్లీ జీవం పోసుకుని... వట వృక్షంగా అవతరించనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు.. మర్రి వృక్షం వేర్లతో సహా పెకిలించుకుని పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ప్రకృతి ప్రేమికుడు, సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తున్న డాక్టర్ ప్రకాశ్... భూ యజమానులతో చర్చించి... 4 నెలలుగా క్రమం తప్పకుండా మర్రి మోడుకు నీటిని అందిస్తూ వచ్చారు. ఆయన కృషి ఫలించి వృక్షం చిగురించింది. దాన్ని ట్రాన్స్ ప్లాంటేషన్ విధానంతో సురక్షిత ప్రాంతానికి తరలించాలని భావించిన ప్రకాష్... రూ.50 వేలు ఖర్చు అవుతుందని దాతల సహకారం ఎదురు చూశారు.
ప్రకృతి ప్రేమికుడి కృషి.. చిగురించిన వటవృక్షం - Transplantation
Decades of Tree Transplantation at Suddala : ప్రాణ వాయువును అందించే చెట్టు... ప్రకృతి విలయ తాండవానికి నేలకొరిగింది. ఏడు దశాబ్దాల క్రితం నాటిన ఈ వృక్షం... ఈదురు గాలుల బీభత్సానికి కుప్పకూలిపోయింది. దానిని నరికి వంట చెరుకుగా వాడుకుందామని అనుకున్నారు స్థానికులు. కానీ నీటిని పోసి... ఆ మర్రి చెట్టుకు ప్రాణం పోశారు ప్రకృతి ప్రేమికుడు ప్రకాశ్.
ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్.. తనవంతు సహకారాన్ని అందించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో... వృక్షాన్ని వేరే చోటకు తరలించారు. భారీ సైజులో ఉన్న వృక్షాన్ని తరలించేందుకు క్రేన్లను ఉపయోగించారు. దీనిని 3 భాగాలుగా చేసి... రెండింటిని జిల్లాలోని జిల్లెల్ల అటవీ ప్రాంతంలోని రాముని బండ వద్ద నాటించారు. కాండాన్ని సిరిసిల్ల ఎస్పీ కార్యాలయం వద్దకు తరలించారు. అక్కడ ఆ చెట్టును నాటనున్నారు.
ఇదీ చదవండి:Farmers Innovative thinking: వాగు నీటిని ఒడిసిపట్టి.. రైతుల భగీరథ స్ఫూర్తి..