రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని భాజాపా నాయకులు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాజపాలో కీలక నాయకులుగా వ్యవహరిస్తూ, దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి అన్నారు. సీనియర్ న్యాయవాది అయిన అరుణ్ జైట్లీ మృతి భాజపాకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబానికి సిరిసిల్ల పట్టణ భాజపా నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు అన్నల్ దాస్ వేణు, చందు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
జైట్లీ మృతి భాజపాకు తీరని లోటు : సిరిసిల్ల భాజపా నాయకులు - అరుణ్ జైట్లీ
రాజన్న సిరిసిల్లలోని భాజపా నాయకులు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. సీనియర్ న్యాయవాది అయిన జైట్లీ మరణం భాజపాకు తీరని లోటు అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు.
జైట్లీ మృతి భాజపాకు తీరని లోటు : సిరిసిల్ల భాజపా నాయకులు