రాజన్నసిరిసిల్ల జిల్లా నెహ్రూనగర్‌కు చెందిన వెంగళ కాంతవ్వ కరోనా బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ. 12 వేలు సాయం చేసింది. తనకు వచ్చిన పింఛన్ డబ్బుల నుంచి కొెంత సొమ్మును జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్‌కు అందించింది.
సీఎం సహాయనిధికి.. వృద్ధురాలు, ఓ చిన్నారి సాయం - రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు వార్తలు
కరోనా కట్టడి కోసం సీఎం సహాయనిధికి ఓ వృద్ధురాలు సాయం చేసింది. పింఛన్ డబ్బులు దాచుకొని రూ.12 వేలు జిల్లా కలెక్టర్‌కు అందించింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఓ చిన్నారి కూడా వెయ్యి రూపాయలను విరాళంగా ఇచ్చింది.
సీఎం సహాయనిధికి.. ఓ చిన్నారి, వృద్ధురాలీ సాయం
అంతేకాదు సిరిసిల్ల పట్టణంలోని సుందరయ్య నగర్‌కు చెందిన వెంగళ శ్రీనివాస్-మమతల కూతురు అక్షర కూడా తాను కిడ్డీ బ్యాంకులో దాచుకున్న 1000 రూపాయలను కలెక్టర్‌కు అందజేసింది. వారిద్దరిని కలెక్టర్ అభినందించారు.
ఇదీ చూడండి :'మాస్కులు, శానిటైజర్లు ఇవ్వట్లేదు...జీతాలూ ఆపేశారు'