రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం గుట్టలో పెద్దూర్కు చెందిన ఓ దొంగబాబా బాగోతం బయట పడింది. ఓ అమాయక కుటుంబానికి ఆరోగ్య సమస్యలను లేకుండా చేస్తానని మాయమాటలు చెప్పి అగ్రహారం గుట్టల్లోకి తీసుకువచ్చి భూత వైద్యం పేరుతో నయం చేస్తానంటూ క్షుద్ర పూజలు మొదలు పెట్టాడు. క్షుద్ర పూజలు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు వీడియో తీశారు. ఏం మంత్రాలు చేస్తున్నావంటూ గట్టిగా అడిగే సరికి.. అక్కడున్న తన వస్తువులన్నీ మూటగట్టుకొని పరారయ్యాడు. జిల్లాలో ఇలాంటి నకిలీ బాబాలపై పోలీసుల నిఘా కూడా లేకపోవడం వల్ల అమాయక ప్రజలు మోసపోతున్నారని, దొంగబాబాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
వేములవాడ గుట్టల్లో క్షుద్ర పూజల కలకలం.. అడ్డుకున్న స్థానికులు! - క్షుద్రపూజలు
ఆరోగ్య సమస్యలను, ఇంటి సమస్యలను క్షుద్ర పూజలతో, భూత వైద్యంతో నయం చేస్తానంటూ మాయమాటలు చెప్పి అమాయక ప్రజల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఆరోగ్య సమస్యలు మాయం చేస్తానంటూ దెయ్యం పేరుతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం గుట్టల్లో భూత వైద్యం చేస్తున్న దొంగబాబాను స్థానికులు అడ్డుకున్నారు.
వేములవాడ గుట్టల్లో క్షుద్ర పూజల కలకలం.. అడ్డుకున్న స్థానికులు!