వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందంటూ భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. రాజన్న ఆలయంలో ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన జిల్లా కలెక్టర్‌ను అడ్డుకున్నారు.
రాజన్న ఆలయం వద్ద భాజపా నాయకుల ధర్నా - vemulawada
వేములవాడ రాజన్న ఆలయం వద్ద భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందంటూ ఆరోపించారు.
రాజన్న ఆలయం వద్ద భాజపా నాయకుల ధర్నా
వందల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:అర్దరాత్రి పేలుళ్లు.. నిద్రలేని రాత్రులు..