రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటలోని వెల్ది హరిప్రసాద్ మగ్గాలను మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ పరిశీలించారు. చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా సంక్షోభంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'చేనేత కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి' - corona effect on Weavers in sircilla district
కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభంతో చేనేత కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో రాపోలు ఆనంద్ భాస్కర్ పర్యటన
అనంతరం అగ్గిపెట్టెలో చీర ఇమిడే ప్రక్రియ, మగ్గంపై నేసిన వినాయకుడు, కొండా లక్ష్మణ్ బాపూజీ రూపాలను పరిశీలించారు. ఎంపీ ఆనంద్ వెంట పట్టణ అధ్యక్షుడు అన్నల్ దాస్ వేణు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆడెపు రవీందర్, కౌన్సిలర్ గూడూరు భాస్కర్, నాయకులు చెన్నంనేని కమలాకర్ రావు, మ్యాన రాంప్రసాద్, బర్కం నవీన్ యాదవ్, ఆడిపెళ్లి శ్రీనివాస్ ఉన్నారు.
- ఇదీ చూడండి:'మార్కెట్లో అమ్ముడుపోయే పంటలే పండించాలి'