తెలంగాణ

telangana

ETV Bharat / state

కేజీ టు పీజీ ఒకే చోట.. ఎక్కడంటే? - తెలంగాణ విశేషాలు

KG to PG in Telangana: : రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యకు నమూనాగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రాంగణం సిద్ధమైంది. ప్రభుత్వ, సీఎస్‌ఆర్‌ సంయుక్త నిధులు రూ.9.50 కోట్లతో దీన్ని తీర్చిదిద్దారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో అంగన్‌వాడీ కేంద్రం నుంచి పీజీ కళాశాల వరకు ఒకేచోట నిర్మించిన ఈ ప్రాంగణం రాష్ట్రంలోనే ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ ఏడాది శాతవాహన విశ్వవిద్యాలయం ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్సు, ఎంకాం ప్రవేశాలకు అనుమతిచ్చింది.

KG to PG in The State at One Place
KG to PG in The State at One Place

By

Published : Nov 18, 2022, 9:00 AM IST

KG to PG in Telangana: అన్ని కోర్సుల్లో కలిపి 1899 మంది విద్యార్థులు ఉన్నారు. విశాలమైన గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌, ఒకేసారి వెయ్యి మంది కూర్చుని తినేలా భోజనశాల ఉంది. ఆటల కోసం ప్రత్యేకంగా సింథటిక్‌తో రూపొందించిన మైదానం ఉంది. ఇందులో క్రికెట్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ కోర్టులు ఉన్నాయి. ఈ ప్రాంగణంలో 1964లో ప్రారంభించిన పాఠశాల కాలక్రమేణా శిథిలావస్థకు చేరుతుండగా, నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఇక్కడే వేర్వేరుగా ఉన్నత పాఠశాల, డిగ్రీ కళాశాల భవనాలకు నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని విద్యాలయాలను ఒకే ఆవరణలోకి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది. దాన్ని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ముందడుగు పడింది. గివ్‌ తెలంగాణ, కె రహేజా సంస్థలు.. ఈ ప్రాంగణం ఆధునికీకరణకు ముందుకొచ్చాయి.

వీటితోపాటు ఎంఆర్‌ఎఫ్‌, మైండ్‌స్పేస్‌, దివీస్‌ సంస్థలు ఫర్నిచర్‌, ఆట వస్తువులు, కంప్యూటర్లు, డిజిటల్‌ తరగతులకు ఉపయోగించే ప్రొజెక్టర్ల వంటివి సమకూర్చాయి. ఇదే ప్రాంగణంలో యువతకు నైపుణ్య శిక్షణనిచ్చేందుకు టాస్క్‌ కేంద్రం, బీసీ స్టడీ సర్కిల్‌ నిర్వహణకు ప్రత్యేక గదులు, గ్రంథాలయం, మహిళలకు కుట్టుశిక్షణ ఇచ్చేందుకు వేర్వేరుగా భవనాలు నిర్మించారు. ఇంత విశాలమైన ప్రాంగణం నిర్వహణ బాధ్యతలను ‘గివ్‌ తెలంగాణ’ సంస్థ చూసుకుంటుంది. ఈ వారంలో మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డిల చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details