సిరిసిల్లకు చెందిన స్నేహ... 'ఫేస్ టచ్ కాషన్ అలారం' రూపొందించింది. కరోనా నియంత్రణలో భాగంగా యువతి వినూత్న ప్రయోగంతో ఆకట్టుకుంది. చేతులతో ముక్కు, నోరు, కళ్లు తాకకూడదనే వైద్యుల సూచనల మేరకు.... ఓ ప్రత్యేక అలారం తయారు చేసింది.
చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది
ఎంత బిజీగా పని చేస్తున్నా... ఖాళీగా కూర్చున్నా కొందరికి చేతులు ముఖం మీదకు వెళ్లిపోతాయి. కరోనా సమయంలో చేతులతో ముఖాన్ని తాకకూడదని తెలిసినప్పటికీ ఎంత ప్రయత్నిస్తున్నా నియంత్రించుకోలేకపోతున్నారా?... అయితే మీలాంటి వారికోసమే ఈ 'ఫేస్ టచ్ కాషన్ అలారం'. ఆ విశేషాలేమిటో మీరూ చూడండి.
చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది
మనకు తెలియకుండానే చేతులు ముఖ భాగాలను తాకేందుకు వెళ్లినప్పుడు, ఇతరులతో చేయి కలిపే ప్రయత్నం చేసినప్పుడు... ఫేస్ టచ్ కాషన్ అలారం దానంతట అదే మోగుతుంది. వెంటనే మనల్ని అప్రమత్తం చేస్తుంది. కరోనా సమయంలో తన వంతు బాధ్యతగా ఏమైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈ అలారం తయారు చేశానని చెబుతోంది స్నేహ.
ఇదీ చూడండి :ఎగ్జిబిషన్ మైదానంలో అన్నీ ఫ్రీ
Last Updated : Apr 12, 2020, 2:59 PM IST